Anand Mahindra: అంతా మనసులోనే ఉంది.: ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో

Anand Mahindra shares video of men waiting for cars to splash water on them

  • సానుకూల దృక్పథాన్ని తెలియజేసే వీడియోని పంచుకున్న పారిశ్రామికవేత్త
  • అనుకూలత, ప్రతికూలత మనసుపైనే ఆధారపడి వుంటాయని వ్యాఖ్య 
  • దీనికి యూజర్ల నుంచి మంచి స్పందన

పది మందికి స్ఫూర్తినివ్వడంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కృషిని మనస్ఫూర్తిగా మెచ్చుకోవాల్సిందే. ఎన్నో ఆవిష్కరణలు, గొప్ప ఐడియాలు, సానుకూల దృక్పథానికి సంబంధించి వీడియోలను, ఫొటోలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ మార్పు కోసం తనవంతుగా కృషి చేస్తుంటారు. పారిశ్రామికవేత్త అయినా కొంత సమయాన్ని సమాజం కోసం కేటాయిస్తుంటారు. తాజాగా ఓ వీడియో క్లిప్ ను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పంచుకున్నారు.

ఈ వీడియో ద్వారా ఓ మంచి సానుకూల సందేశాన్ని ఇచ్చారు. ఓ రహదారిపై పల్లపు ప్రాంతంలో నీరు నిలిచి ఉంటుంది. వచ్చి పోయే కార్ల వేగానికి ఆ నీరు ఫౌంటేన్ మాదిరి చిమ్మి పక్కన పడుతోంది. ఓ ఇద్దరు పెద్ద వారు షార్ట్ తో, ఓ బేబీ స్విమ్ సూట్ ధరించి ఆ నీరు నిలిచిన చోట రోడ్డు పక్కనే ఉన్నారు. వచ్చి పోయే కార్ల డ్రైవర్లకు ఆ నీటిపై నుంచి దూసుకుపోవాలంటూ సంకేతం ఇస్తున్నారు. అలా కార్లు వేగంగా నీటి పై నుంచి వెళ్లినప్పుడు చిమ్మి వారి మీద పడుతుంటే, నీటి జల్లులో వారు కేరింతలు కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. 

‘‘ప్రతికూలతా.. అవకాశమా? అంతా మన మనసులో, మన దృక్పథం పైనే ఆధారపడి ఉంటుంది’’ అని ఈ వీడియోకి ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ పెట్టారు. నిజమే, కొందరు ఈ నీరు చిమ్మి మీద పడితే దాన్ని ఇబ్బందిగా భావిస్తారు. కానీ, వీరు మాత్రం దాన్ని అవకాశంగా మలుచుకున్నారు. దీని ద్వారా ఏదైనా మనం చూసే మనసు దృక్కోణంపైనే ఆధారపడి ఉంటుందన్న సందేశాన్నిచ్చారు ఆనంద్ మహీంద్రా. ఈ పోస్ట్ కి 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Anand Mahindra
shares video
positive message
  • Loading...

More Telugu News