Howrah Bridge: చారిత్రక హౌరా బ్రిడ్జ్ సామర్థ్యాన్ని పరీక్షించనున్న నిపుణులు

Iconic Howrah Bridge to undergo in depth health checkup IIT Madras team to be engaged

  • బ్రిడ్జి సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం
  • మద్రాస్ ఐఐటీ నిపుణుల సాయంతో పరీక్షలు
  • జీవిత కాలాన్ని పెంచే విషయమై సమాచారం సేకరణ

పశ్చిమబెంగాల్ లోని హౌరా బ్రిడ్జికి ఎంతో చరిత్ర ఉంది. హూగ్లీ నదిపై నిర్మితమైన ఈ వారధి హౌరా, కోల్ కతా నగరాలను కలుపుతుంది. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ బ్రిడ్జి సామర్థ్యాన్ని నిపుణులు పరీక్షించనున్నారు. ఐఐటీ మద్రాస్ నిపుణుల సాయంతో బ్రిడ్జిని పరీక్షించనున్నట్టు కోల్ కతా పోర్ట్ చైర్మన్ రతేంద్ర రామన్ తెలిపారు. ఈ వంతెనకు 80 ఏళ్లు. దీంతో దీని సామర్థ్యాన్ని 11 ఏళ్ల తర్వాత మరోసారి పరీక్షించనున్నారు.

‘‘మరింత లోతైన అధ్యయనం నిర్వహించాలని నిర్ణయించాం. ఇలాంటి అధ్యయనం చేసి దశాబ్దం గడిచిపోయింది. బ్రిడ్జి జీవిత కాలాన్ని ఎలా పెంచొచ్చన్న అంశంపై కీలక వివరాలను ఈ అధ్యయనం తెలుసుకునేలా చేస్తుంది’’ అని ఆయన వివరించారు. హౌరా బ్రిడ్జికి రవీంద్ర సేతు అని కూడా పేరు. దీని పొడవు 405 మీటర్లు. 21.6 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. 1943లో దీన్ని ప్రారంభించగా, కోల్ కతాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నిత్యం 80వేల వాహనాలు ఈ వంతెనపై నుంచి ప్రయాణిస్తుంటాయి.

  • Loading...

More Telugu News