Jeff Bezos: ప్రియురాలితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్

Amazon founder Jeff Bezos engagement with girl friend
  • 2018 నుంచి డేటింగ్ లో ఉన్న బెజోస్, లారెన్
  • 2019లో తొలి భార్య నుంచి విడాకులు తీసుకున్న బెజోస్
  • ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్న బెజోస్, లారెన్
తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ తో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పేజ్ సిక్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఇద్దరూ ఫ్రాన్స్ లో ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కొన్ని నెలలుగా సాగుతోంది. పేజ్ సిక్స్ కథనం ప్రకారం లారెన్ శాంచెజ్ హార్ట్ షేప్ లో ఉన్న ఉంగరాన్ని ధరించింది. ఇది ఎంగేజ్ మెంట్ రింగేననే కథనంలో ఉంది. మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అయిన 53 ఏళ్ల సాంచెజ్, 59 ఏళ్ల బెజోస్ 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారు. తన తొలి భార్య మెకెంజీ స్కాట్ తో 2019లో బెజోస్ విడాకులు తీసుకున్నాడు. వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాతే తమ ప్రేమ వ్యవహారాన్ని బెజోస్, లారెన్ బయటపెట్టారు.
Jeff Bezos
Lauren Sanchez
Engagement
Amazon

More Telugu News