Tollywood: శర్వానంద్ డెస్టినేషన్ వెడ్డింగ్.. పెళ్లి ఎప్పుడు.. ఎక్కడ అంటే..!

Sharwanand and Rakshita will tie knot on June 2nd and 3rd at the Leela Palace Jaipur
  • జూన్ 2, 3వ తేదీల్లో జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో పెళ్లి
  • రక్షిత రెడ్డితో జనవరిలో శర్వా నిశ్చితార్ధం
  • పెళ్లి ఆగింది, వాయిదా పడిందన్న పుకార్లకు చెక్ పెట్టిన యువ హీరో
టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ పెళ్లిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. శర్వా ప్రేమించి నిశ్చితార్ధం కూడా చేసుకున్న రక్షితతో అతని పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ.. వాయిదా పడిందంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఇవన్నీ పుకార్లేనని శర్వా తన మేనేజర్ ద్వారా అధికారికంగా  ప్రకటించాడు. తను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నాడు. జూన్ 2, 3వ తేదీల్లో రాజస్థాన్ జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా–రక్షిత వివాహం ఘనంగా జరుగుతుందని స్పష్టం చేశాడు. 

ఈ రోజు నుంచే పెళ్లి కార్యక్రమాలు మొదలైనట్టు తెలుస్తోంది. వివాహ వేడుకకు శర్వాకు చిన్ననాటి మిత్రుడైన రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రక్షితా రెడ్డితో శర్వా జనవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.
Tollywood
Sharwanand
wedding
Chiranjeevi
Ramcharan

More Telugu News