DK Shivakumar: సిద్ధరామయ్యవైపే ఎమ్మెల్యేల మొగ్గు!

Over 80 MLAs Back Siddaramaiah in karnataka cm race says sources

  • సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఎమ్మెల్యేలకు ఓటింగ్
  • మాజీ ముఖ్యమంత్రికి 80 మంది ఎమ్మెల్యేల మద్దతు
  • పోటీలో వెనకబడ్డ డీకే శివకుమార్

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేనా? అంటే ఆ పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా సేవలు అందించిన సిద్ధరామయ్యవైపే ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎం సీటు రేసులో సిద్ధరామయ్యే ముందంజలో ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు 80 మంది ఆయనకే మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవి కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్య పోటీ పడుతున్న విషయం తెలిసిందే!

ఈ నేతలు ఇద్దరిలో ఎమ్మెల్యేల మద్దతు ఉన్నవారికే సీఎం పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యేలకు ఓటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఓటింగ్ లో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్యే ముందుండగా.. ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ వెనకబడ్డట్లు సమాచారం. దీంతో కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

DK Shivakumar
Siddaramaiah
Karnataka
Congress
Race for cm post
  • Loading...

More Telugu News