Parineeti Chopra: అట్టహాసంగా ఎంపీ, బాలీవుడ్ నటి నిశ్చితార్ధం.. ఫొటోలు ఇవిగో!

Parineeti Chopra and Raghav Chadha engagement
  • కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఎంపీ రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా
  • నిన్న సాయంత్రం ఢిల్లీలో ఎంగేజ్ మెంట్
  • హాజరైన ఢిల్లీ, పంజాబ్ సీఎంలు, పలువురు ప్రముఖులు
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్‌ చద్దా ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. చాన్నాళ్లుగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియా కంట పడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ నిన్న సాయంత్రం వీరిద్దరూ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొంతమంది అతిథుల సమక్షంలో ఉంగరాలు మార్చుకొని నిశ్చితార్థం చేసుకున్నారు.

సెంట్రల్‌ ఢిల్లీలో ఉన్న కపుర్తలా హౌస్‌లో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు. నిశ్చితార్థ వేడుక తర్వాత రాఘవ్‌, పరిణితీ తమ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. అవి వైరల్‌ అయ్యాయి. వేడుక తర్వాత ఇద్దరూ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.
Parineeti Chopra
Raghav Chadha
engagement
Bollywood

More Telugu News