Parineeti chopra: నేడే పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం.. ఢిల్లీకి సెలబ్రిటీల క్యూ!

Priyanka Chopra Lands In Delhi Ahead Of Parineeti And Raghav Chadhas Engagement

  • ఢిల్లీలోని కపుర్తలా హౌస్ లో సాయంత్రం జరగనున్న వేడుక
  • లండన్ నుంచి వచ్చిన ప్రియాంక చోప్రా
  • హాజరుకానున్న పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాజకీయ నేత, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఈ రోజు జరగనుంది. ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో జరిగే వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిమిత సంఖ్యలో అతిథులు పాల్గొననున్నారు. సిక్కు ఆచారాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుందని సమాచారం. సాయంత్రం 6 గంటలకు ఆర్దాస్ తర్వాత సుఖ్మణి సాహిబ్ తో ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుక కోసం పరిణీతి అక్క (కజిన్), హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఢిల్లీ చేరుకున్నారు. 

పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొననున్నట్టు సమాచారం. కాగా, కొంతకాలంగా ప్రేమలో ఉన్న పరిణీతి, రాఘవ్ ముంబైలో పలుమార్లు లంచ్, డిన్నర్ డేట్ కు వచ్చి మీడియా కంటపడ్డారు. కానీ, తమ ప్రేమ, పెళ్లి విషయాన్ని వాళ్లు ధ్రువీకరించలేదు. పరిణీతి - రాఘవ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కలిసి చదువుకున్నారని, వారు చాలా కాలం నుంచే స్నేహితులు అని తెలుస్తోంది.

Parineeti chopra
Raghav Chadha
AAP
mp
Engagement
Priyanka Chopra
New Delhi
Arvind Kejriwal
Bhagwant Singh Mann
  • Loading...

More Telugu News