Imran Khan: ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్.. బయట కాల్పులు

 Firing outside Islamabad HC as Imran Khan set to leave building

  • కోర్టు నుంచి బయటకు వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో కాల్పులు
  • తమ సిబ్బందిపై కాల్పులు జరిగాయన్న పోలీసులు
  • కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని వివరణ

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో ఉండగా బయట కాల్పులు జరిగాయి. కాల్పులు వాస్తవమే కానీ, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఇస్లామాబాద్ పోలీసులు తెలిపారు. జి-11, జి-13 సెక్టార్‌లో పోలీసులుపై కాల్పులు జరిగినట్టు పేర్కొన్నారు. పలు కేసుల విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో కాల్పులు జరిగినట్టు ‘డాన్.కామ్’ పేర్కొంది.

కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు వద్ద భద్రతను పెంచారు. ఆ తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటీఐ చీఫ్ ఇమ్రాన్‌ను ఈ నెల 15 వరకు అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు ఆదేశాల తర్వాత కాల్పులు జరగడం గమనార్హం. లాహోర్‌లో నమోదైన మూడు ఉగ్రవాదం కేసులు, జిల్లే షా హత్య కేసుల్లో అరెస్ట్ నుంచి ఇమ్రాన్‌కు రక్షణ కల్పిస్తూ కోర్టు బెయిలు మంజూరు చేసింది.

Imran Khan
Pakistan
Islamabad High Court
Firing
PTI Chief
  • Loading...

More Telugu News