Nara Lokesh: లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న మరదలు, తోడల్లుడు

Tejaswini and Bharat joins Lokesh padayatra in Kodumuru

  • కర్నూలు జిల్లాలో లోకేశ్ యువగళం 
  • కోడుమూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర
  • పాదయాత్రలో పాల్గొన్న తేజస్విని, భరత్
  • లోకేశ్ కు సంఘీభావం తెలిపిన వైనం
  • టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు 94వ రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో జరుగుతోంది. కాగా, ఇవాళ్టి పాదయాత్రలో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. 

లోకేశ్ మరదలు తేజస్విని (బాలకృష్ణ చిన్నకుమార్తె), ఆమె భర్త భరత్ కర్నూలు జిల్లాకు విచ్చేశారు. లోకేశ్ ను కలిసి యువగళం పాదయాత్రకు మద్దతు పలికారు. లోకేశ్ తో కలిసి వారు కోడుమూరు పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేశ్ మరదలు, తోడల్లుడు కూడా పాదయాత్రలో కలిసి నడిచిన నేపథ్యంలో, పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. 

మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, భూమా అఖిలప్రియ, ఆలూరు నియోజకవర్గ ఇన్ చార్జి కోట్ల సుజాతమ్మ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, సత్తెనపల్లి పార్టీ నాయకుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు తదితరులు లోకేశ్ కు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు.

Nara Lokesh
Tejaswini
Bharat
Yuva Galam Padayatra
TDP
Kurnool District
Andhra Pradesh
  • Loading...

More Telugu News