Mehreen: ఐఏఎస్ అధికారిణితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న మెహ్రీన్ మాజీ ప్రియుడు

Mehreen Ex boy friend engagement with IAS officer
  • 2021లో మెహ్రీన్, భవ్య భిష్ణోయ్ ఎంగేజ్ మెంట్
  • ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయిన జంట
  • 2022లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన భవ్య భిష్ణోయ్
సినీనటి మెహ్రీన్ పెళ్లి రద్దయిన సంగతి తెలిసిందే. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్ తో ఆమె పెళ్లి రద్దయింది. 2021 మార్చిలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే రోజుల వ్యవధిలోనే అభిప్రాయ భేదాలతో ఇద్దరూ పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. మెహ్రీన్ తన సినిమాలపై ఫోకస్ చేయగా... భవ్య భిష్ణోయ్ 2022లో జరిగిన బైపోల్ లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు భిష్ణోయ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఐఏఎస్ అధికారిణి పరి భిష్ణోయ్ ను పెళ్లాడబోతున్నారు. వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.   
Mehreen
Ex boy friend
engagement
Tollywood

More Telugu News