గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు ఈ బ్యాంకుల్లో..
- వడ్డీ రేటులో వ్యత్యాసంతో చెల్లింపుల్లో భారీ అంతరం
- ఆకర్షణీయమైన రేటుకు తీసుకుంటే దీర్ఘకాలంలో ఎంతో ఆదా
- వడ్డీ రేటుపై క్రెడిట్ స్కోరు, చెల్లింపుల సామర్థ్యం ప్రభావం
గృహ రుణంపై వడ్డీ రేటు అందరికీ ఒకే మాదిరి ఉంటుందని అనుకోవద్దు. దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. చెల్లింపుల సామర్థ్యాన్ని బ్యాంకులు చూస్తాయి. కొనుగోలు చేస్తున్న లేదా ఇల్లు కడుతున్న ప్రాంతానికి ఉన్న డిమాండ్ ను చూస్తాయి. వీటి ఆధారంగా రిస్క్ ను విశ్లేషిస్తాయి బ్యాంకులు. ఇవన్నీ వడ్డీ రేటుపై ప్రభావం చూపిస్తాయి.
| బ్యాంక్ | కనీస వడ్డీ రేటు (శాతంలో) | గరిష్ఠ వడ్డీ రేటు |
| ఇండస్ ఇండ్ బ్యాంక్ | 8.4 | 9.75 |
| ఇండియన్ బ్యాంక్ | 8.45 | 9.1 |
| హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ | 8.45 | 9.85 |
| యూకో బ్యాంక్ | 8.45 | 10.3 |
| బ్యాంక్ ఆఫ్ బరోడా | 8.5 | 10.5 |
| బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర | 8.6 | 10.3 |
| యూనియన్ బ్యాంక్ | 8.75 | 10.5 |
| ఐడీబీఐ బ్యాంక్ | 8.75 | 10.5 |
| పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 8.8 | 9.45 |
| కోటక్ మహీంద్రా బ్యాంక్ | 8.85 | 9.35 |