Save The Tigers: ‘సేవ్ ది టైగర్స్’ కు సీక్వెల్ వస్తోంది: నిర్మాత రాఘవ

 Save The Tigers Season 2 will start soon says Producer

  • డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న సేవ్ ది టైగర్స్ సిరీస్
  • యాత్ర ఫేమ్ మహి వి రాఘవ నిర్మాణంలో, తేజ కాకుమాను దర్శకత్వం
  • యాత్ర2 సీక్వెల్ స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని వెల్లడించిన రాఘవ

ఓటీటీ ప్లాట్ ఫామ్ లో  వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. తెలుగులో ఇప్పుడు బాగా పాప్యులర్ అయిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్‌’. డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ కామెడీ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఆనందో బ్రహ్మ, యాత్ర వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహి వి రాఘవ నిర్మాతగా, తేజ కాకుమాను దీనికి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, సుజాత, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, రోహిణి తదితరులు నటించిన ఈ సిరీస్‌ తొలి ఎపిసోడ్ కు అద్భుతమైన స్పందన రావడంపై నిర్మాత మహి వి రాఘవ సంతోషం వ్యక్తం చేశాడు. సిరీస్ లోని కామెడీకి అందరూ బాగా కనెన్ట్ అయ్యారని చెప్పాడు. 

దీనికి మంచి ఆదరణ లభించడంతో అంతా సీక్వెల్ ఎప్పుడని అడుగుతున్నారని తెలిపాడు. త్వరలో సిరీస్ 2 షూట్ ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. దీని తర్వాత ‘సైతాన్’ అనే కొత్త వెబ్ సిరీస్‌ ను కూడా ప్రేక్షకుల ముందు తీసుకొస్తానని తెలిపాడు. ఇది జూన్ లో హాట్ స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతుందన్నాడు. ఇది క్రైమ్ డ్రామా అని తెలిపాడు. అలాగే, ‘యాత్ర2’ కోసం స్ర్కిప్ట్‌ పనులు జరుగుతున్నాయని వెల్లడించాడు. శ్రద్ధ శ్రీనాధ్  ప్రధాన పాత్రలో  ‘సిద్ధా లోకం ఎలా ఉంది నాయన’ అనే సెటైరికల్ చిత్రానికి దర్శకత్వం వహించినట్టు చెప్పాడు.

Save The Tigers
seasin2
Producer
hotstar
  • Loading...

More Telugu News