Amritsar: అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద మరో పేలుడు

Secong bomb blast near Amritsar Golden Temple

  • గోల్డెన్ టెంపుల్ వద్ద ఉన్న హెరిటేజ్ స్ట్రీట్ లో పేలుడు
  • పేలుడులో ఒకరికి గాయాలు
  • నిన్న ఇదే ప్రాంతంలో తొలి పేలుడు

పంజాబ్ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద ఉన్న హెరిటేజ్ స్ట్రీట్ లో ఈ ఉదయం మరో పేలుడు సంభవించింది. గోల్డెన్ టెంపుల్ కు వెళ్లే మార్గంలోని సారాగర్హి సరాయ్ సమీపంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ సహా డాగ్ స్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కాలికి స్వల్పంగా గాయమయింది. ప్రస్తుత పరిస్థితి సాధారణంగా ఉందని అమృత్ సర్ అసిస్టెంట్ డీసీపీ మెహ్తాబ్ సింగ్ తెలిపారు. ఇదే ప్రాంతంలో నిన్న కూడా బాంబు పేలుడు సంభవించింది. నిన్నటి ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.

Amritsar
Golden Temple
Bomb Blast
  • Loading...

More Telugu News