Hyderabad: ట్రాక్‌పై ఇన్‌స్టా రీల్స్.. హైదరాబాద్‌లో రైలు ఢీకొని విద్యార్థి దుర్మరణం

  • సనత్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
  • 16 ఏళ్ల సర్ఫరాజ్ అనే విద్యార్థి మృతి
  • త్రుటిలో తప్పించుకున్న మరో ఇద్దరు విద్యార్థులు
Student dies on railway track while doing insta reels

రీల్స్ సరదా ఓ నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. రైల్వే ట్రాక్ పై రీల్స్ చేస్తుండగా పదహారేళ్ల విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన హైదరాబాద్ లోని సనత్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం రైల్వే లైన్ సమీపంలో ముగ్గురు యువకులు ఇన్ స్టా రీల్స్ చేస్తున్నారు. 

ఆ సమయంలో వేగంగా వచ్చిన రైలు సర్ఫరాజ్ అనే విద్యార్థిని ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరు రైలు రాకను గమనించి పక్కకు తప్పుకున్నారు. సమాచారం రాగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. మృతుడు రహ్మద్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉంటున్నాడు.

More Telugu News