Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ నేతలతో ములాఖత్ కు చంద్రబాబుకు అనుమతి

Chandrababu got permission for mulakhat in Rajahmundry central jail

  • సెంట్రల్ జైల్లో ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, వాసు
  • ములాఖత్ కు చంద్రబాబు, అచ్చెన్నాయుడు, గోరంట్లకు అనుమతి
  • సాయంత్రం 4 గంటలకు సెంట్రల్ జైలుకు చేరుకోనున్న చంద్రబాబు

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ కు టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుమతి లభించింది. జైల్లో ఉన్న టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను ఆయన పరామర్శించనున్నారు. ఆయనతో పాటు వెళ్లడానికి పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలకు అధికారులు అనుమతిని ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు సెంట్రల్ జైలు వద్దకు రానున్నారు. జైలు వద్దకు చంద్రబాబు రానుండటంతో అక్కడకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకునే అవకాశం ఉంది.

Chandrababu
Atchannaidu
Gorantla Butchaiah Chowdary
Telugudesam
Rajahmundry
Central Jail
  • Loading...

More Telugu News