jobs: బీటెక్ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు

ISRO Recruitment 2023 for 65 Scientist and Engineer Posts

  • 65 సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ
  • కనీసం 60 శాతం మార్కులతో పాస్ తప్పనిసరి
  • దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు ఈ నెల 24

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు, యూనిట్లలో సైంటిస్ట్/ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈమేరకు ఇస్రో సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఐసీఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న 65 పోస్టులను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ లింక్

దరఖాస్తు చేయడానికి కావాల్సిన అర్హతలు..
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్ తో కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీఆర్క్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయసు మే 24, 2023వ తేదీ నాటికి 28 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం, గడువు: ఆన్ లైన్ లో మే 24 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ రూ.250లు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్‌ ఫీజు చెల్లించేందుకు తుది గడువు మే 26.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 
జీతం: ఎంపికైన వారికి నెలకు రూ.56,100 లు చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు..
సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్‌సీ’ (సివిల్) పోస్టులు: 39
సైంటిస్ట్/ ఇంజనీర్ ‘ఎస్‌సీ ‘ (ఎలక్ట్రికల్) పోస్టులు: 14
సైంటిస్ట్/ ఇంజనీర్ ‘ఎస్‌సీ’ (రిఫ్రిజెరేషన్‌ అండ్‌ ఎయిర్ కండిషనింగ్) పోస్టులు: 9
సైంటిస్ట్/ ఇంజనీర్ ‘ఎస్‌సీ’ (ఆర్కిటెక్చర్) పోస్టులు: 1
సైంటిస్ట్/ ఇంజనీర్ ‘ఎస్‌సీ’ (సివిల్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్‌ పోస్టులు: 1
సైంటిస్ట్/ ఇంజనీర్ ‘ఎస్‌సీ’ (ఆర్కిటెక్చర్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్‌ పోస్టులు: 1

jobs
governament jobs
ISRO notification
job notification
Engineer posts
  • Loading...

More Telugu News