MS Dhoni: చివరి ఐపీఎల్‌ను ఎంజాయ్ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు ధోనీ సమాధానం ఇదే..!

  • లక్నోతో మ్యాచ్ సందర్భంగా రిటైర్మెంట్‌పై ధోనీ స్పందన
  • తన రిటైర్మెంట్ గురించి మీరే నిర్ణయించేసుకున్నారన్న ధోనీ
  • వచ్చే సీజన్‌లోనూ ధోనీ ఆడతాడన్న కామెంటేటర్
MS Dhoni Responds on his retirement

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై రెండుమూడేళ్లుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రతిసారీ ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ వార్తలు వస్తున్నాయి. ధోనీ నేరుగా స్పందించకున్నప్పటికీ ఈ ఊహాగానాలకు మాత్రం తెరపడడం లేదు. ఈ వార్తలపై తాజాగా ధోనీ స్పందించాడు. లక్నో-చెన్నై మధ్య మ్యాచ్‌కు ముందు ఈ వార్తలపై ధోనీ స్పందించాడు.

టాస్ అనంతరం కామెంటేటర్ మాట్లాడుతూ.. ‘‘ఇది మీ చివరి సీజన్ కదా.. ఎంజాయ్ చేస్తున్నారా?’’ అన్న ప్రశ్నకు ధోనీ స్పందిస్తూ.. ‘‘అలా అని మీరే నిర్ణయించుకున్నారు తప్పితే నేను కాదు’’ అన్నాడు. దీంతో కామెంటేటర్ ప్రేక్షకులవైపు తిరిగి వచ్చే ఏడాది కూడా ధోనీ మళ్లీ ఆడతాడు.. అనడంతో ప్రేక్షకులు కేరింతలతో తమ మద్దతు తెలియజేశారు. 

కాగా, ఇటీవల ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ధోనీ తన ఫేర్‌వెల్‌పై సరదాగా వ్యాఖ్యానించాడు. తన కోసం పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలిపిన అభిమానులను ఉద్దేశించి.. వారందరూ తనకు ఫేర్‌వెల్ ఇచ్చేందుకు సీఎస్‌కే జెర్సీలో వచ్చినట్టు ఉందని వ్యాఖ్యానించాడు.

More Telugu News