Neera Cafe: హుస్సేన్ సాగర్ తీరాన తాళ్ల మధ్యలో కల్లు.. నేడు ‘నీరా కేఫ్’ని ప్రారంభించనున్న కేటీఆర్

Minister KTR today opens Neera Cafe
  • రూ. 20 కోట్లతో నిర్మించిన ‘నీరా కేఫ్’
  • గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫుడ్ కోర్ట్, మొదటి అంతస్తులో నీరా విక్రయం
  • టేక్ అవే  సౌకర్యం కూడా..
  • ఒకేసారి 500 మంది కూర్చునే వెసులుబాటు

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన రూ. 20 కోట్లతో తీర్చిదిద్దిన ‘నీరా కేఫ్’ను తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. కల్లుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి, దానినో పరిశ్రమ స్థాయికి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నీరా కేఫ్‌ను ప్రారంభిస్తోంది.

నెక్లెస్ రోడ్డులో 23 జులై 2020లో నీరా కేఫ్‌కు శంకుస్థాపన చేశారు. రెస్టారెంట్‌ను తలపించే ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మొదటి అంతస్తులో నీరా, గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. తాటి చెట్లు, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరాను శుద్ధి చేసి ఇందులో విక్రయిస్తారు.

అలాగే, నీరా ఉత్పత్తులు కూడా ఇక్కడ లభిస్తాయి. అంతేకాదు, పల్లెలో తాళ్ల మధ్య కూర్చుని కల్లు తీసుకునే అనుభూతి వచ్చేలా కేఫ్‌ను తీర్చి దిద్దారు. ఇందులోని ఏడు స్టాళ్లలో ఒకేసారి గరిష్ఠంగా 500 మంది వరకు కూర్చోవచ్చు. టేక్ అవే సౌకర్యం కూడా ఉంది.

  • Loading...

More Telugu News