Kurnool District: ఆదోని ఏఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణా బాధ్యతలు.. అరగంటలోనే మరో బదిలీ!

Adoni ASP Adhiraj Singh Rana Transferred after joining duties

  • రంపచోడవరం నుంచి బదిలీపై ఆదోనికి
  • బాధ్యతలు స్వీకరించాక కర్నూలు రావాలంటూ ఆదేశాలు
  • ఆయన ట్రాన్స్‌ఫర్ వెనక రాజకీయ నేతల హస్తం ఉందంటున్న  స్థానికులు

బాధ్యతలు స్వీకరించిన అరగంటలోనే మరో బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు కర్నూలు జిల్లా ఆదోని ఏఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా. రంపచోడవరం నుంచి బదిలీపై అదోని వచ్చిన అధిరాజ్ సింగ్ నిన్న ఉదయం 11.25 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. 

ఆ తర్వాత అరగంటకే కర్నూలు రావాలంటూ ఆదేశాలు అందడంతో వెంటనే ఆయన వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. కాగా, విధుల్లో కచ్చితంగా వ్యవహరించే అధిరాజ్ సింగ్ అరగంటలోనే బదిలీ కావడం వెనక రాజకీయ నేతల హస్తం ఉందని స్థానికులు చెబుతున్నారు.

Kurnool District
Adoni
ASP
Adhiraj Singh Rana
  • Loading...

More Telugu News