YS Jagan: జగన్ సీజనల్ క్రిమినల్: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • కోడి కత్తి, వైఎస్ వివేకానంద కేసులను టీడీపీ పైకి నెట్టి గెలిచారన్న గోరంట్ల
  • తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లో మైనింగ్ మాఫియా సాగుతోందని వ్యాఖ్య
  • ఓటమి భయంతో జగన్ భౌతిక దాడులకు దిగుతున్నారన్న టీడీపీ నేత
Gorantla says YS Jagan is a seasonal criminal

ఏపీ సీఎం జగన్ సీజనల్ క్రిమినల్ అని తెలుగు దేశం పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 2019 ఎన్నికల సమయంలో కోడి కత్తి, బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులను టీడీపీ పైకి నెట్టి ఎన్నికల్లో గెలిచాడన్నారు. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లో మైనింగ్ మాఫియా సాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో జగన్ భౌతిక దాడులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. నేర చరిత్ర ఉన్న అధికారులకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

More Telugu News