Employees: ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏపీ సర్కారు తీపి కబురు

AP Govt decides to grant DA for employees and pensioners
షార్ట్స్‌లో చూడండి
ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2022 జనవరి 1 నుంచి పెండింగ్ లో ఉన్న డీఏను మంజూరు చేస్తున్నట్టు నేడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెండు జీవోలు విడుదల చేసింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ జీవో నెం.66... పెన్షనర్లకు డీఏ మంజూరు చేస్తూ జీవో నెం.67 తీసుకువచ్చారు. 

ఈ డీఏను ఈ ఏడాది జులై 1 నుంచి జీతంతో కలిపి ఇవ్వనున్నారు. డీఏ బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు సమాన వాయిదాలలో చెల్లిస్తారని తెలుస్తోంది. కాగా, తాజా డీఏతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ శాతం 22.75కి పెరుగుతుంది.
Go Back to Shorts
Employees
Pensioners
DA
AP Govt
Andhra Pradesh

More Telugu News