crpf: హైదరాబాద్ లో జవాన్ ఆత్మహత్య

CRPF Jawan Suicide in Hyderabad

  • సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న జవాన్ దేవేందర్
  • సీఆర్ పీఎఫ్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డా ఇంట్లో ఘటన
  • ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు

హైదరాబాద్ లో సీఆర్ పీఎఫ్ కు చెందిన జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు. చత్తీస్ గఢ్ కు చెందిన దేవేందర్ కుమార్ 2021 లో సీఆర్ పీఎఫ్ జవాన్ గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం సికింద్రాబాద్ లోని సీఆర్ పీఎఫ్ ఐజీ మహేశ్ చంద్ర లడ్డా ఇంట్లో భద్రతా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున చికోటి గార్డెన్ సమీపంలో దేవేందర్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

జవాన్ దేవేందర్ కుమార్ ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమేనని బేగంపేట పోలీసులు అనుమానిస్తున్నారు. దేవేందర్ కుమార్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, జవాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.

crpf
jawan
suicide
Hyderabad
love failure
  • Loading...

More Telugu News