Hussain Sagar: హుస్సేన్ సాగర్ లో తప్పిన పెనుముప్పు.. వీడియో ఇదిగో!

hagmati Boat passengers stranded during heavy rainstorm in Hussain Sagar

  • ఈదురు గాలులకు అదుపుతప్పిన భాగమతి బోటు
  • భయాందోళనలకు గురైన 30 మంది పర్యాటకులు
  • స్పీడ్ బోట్ల సాయంతో బోటును ఒడ్డుకు చేర్చిన సిబ్బంది

హైదరాబాద్ హస్సేన్ సాగర్ లో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం నగరంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలులకు హుస్సేన్ సాగర్ లో ఒక బోటు అదుపుతప్పింది. వెంటనే రంగంలోకి దిగిన హైదరాబాద్ బోట్ క్లబ్ సిబ్బంది.. స్పీడ్ బోట్ల సాయంతో పర్యాటకుల బోటును తీరానికి చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా హుస్సేన్ సాగర్ లో భాగమతి బోటు అదుపు తప్పింది. గాలి వేగానికి దూరంగా వెళ్లిపోయింది. ఆ సమయంలో బోటులో సుమారు 30 మంది పర్యాటకులు ఉన్నారు. బోటు అదుపు తప్పడంతో వారంతా భయాందోళనలకు గురయ్యారు. భాగమతి బోటు దూరంగా వెళ్లడం గమనించిన పర్యాటక సిబ్బంది ప్రమాదాన్ని శంకించి స్పీడ్ బోట్లతో రంగంలోకి దిగారు. పర్యాటకులతో సహా బోటును తాళ్ల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాక పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.

Hussain Sagar
Boat
Bhagamati boat
heavy rain
winds
  • Loading...

More Telugu News