Saint Von Colucci: బీటీఎస్ గాయకుడు జిమిన్ లా కనిపించాలని 12 సర్జరీలు చేయించుకున్న నటుడు మృతి

Canadian actor dies after 12 surgeries to look as BTS Jimin

  • 2019లో దక్షిణ కొరియా వెళ్లిన కెనడా నటుడు కొలూస్సీ
  • సంగీత రంగంలో అవకాశాల కోసం ప్రయత్నాలు
  • కొరియన్ల తరహాలో కనిపిస్తే అవకాశాలు వస్తాయని నమ్మిన వైనం
  • చివరి ఆపరేషన్ వికటించడంతో కన్నుమూత

ప్రపంచ సంగీత రంగంలో బీటీఎస్ ఓ ప్రభంజనంలా దూసుకొచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ గాయకుల బృందానికి యువతలో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సెలబ్రిటీలు కూడా బీటీఎస్ కు ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి కాదు. అయితే, కెనడా నటుడు 22 ఏళ్ల సెయింట్ వాన్ కొలూస్సీ... బీటీఎస్ సంగీత బృందంలోని జిమిన్ లా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుని ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. 

అచ్చం జిమిన్ లా కనిపించాలని కొలూస్సీ ఏకంగా 12 శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. అయితే చివరి ఆపరేషన్ వికటించడంతో ఆ కెనడా నటుడు ప్రాణాలు విడిచాడు. ఈ నటుడు మ్యూజిక్ ఇండస్ట్రీలో కెరీర్ కోసం 2019లో దక్షిణ కొరియా వెళ్లాడు. తన రూపం కారణంగా దక్షిణ కొరియాలో అవకాశాలు రావేమోనని అతడు అభద్రతా భావానికి గురయ్యేవాడు. కొరియన్ల తరహాలో వీ షేప్ ముఖాకృతిలోకి తన ముఖాన్ని మార్చుకోవడంపై దృష్టి పెట్టాడు. 

ముఖ్యంగా, బీటీఎస్ గాయకుడు జిమిన్ లా తన ముఖాన్ని మార్చుకునేందుకు అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. గత నవంబరులో దవడల ఆకృతి మార్చేందుకు వైద్యులు కొన్ని ఇంప్లాంట్స్ ను శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. ఏప్రిల్ 22న ఆ ఇంప్లాంట్స్ ను తొలగించేందుకు సర్జరీ నిర్వహించారు. 

అయితే, కొలూస్సీ ఇన్ఫెక్షన్ కు గురై ప్రాణాలు విడిచాడు. ఈ మేరకు కెనడా నటుడి పీఆర్వో ఎరిక్ బ్లేక్ వెల్లడించాడు.

Saint Von Colucci
BTS
Jimin
Surgeries
South Korea
Canada
  • Loading...

More Telugu News