MS Dhoni: ధోనీ వస్తే ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలో చెప్పిన చాట్ జీపీటీ

ChatGPT analyses Dhoni batting and fielding setup plans

  •  ప్రతి అంశంపైనా చాట్ జీపీటీ ముద్ర
  • అన్ని రంగాలపైనా లోతైన విశ్లేషణలతో ఆకట్టుకుంటున్న కృత్రిమ మేథ
  • ధోనీ బ్యాటింగ్, ఫీల్డింగ్ మోహరింపులపై తనదైన విశ్లేషణ చేసిన జీపీటీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సిసలైన ఉదాహరణలా నిలుస్తున్న చాట్ జీపీటీ... ప్రతి రంగంలోనూ తనదైన విశ్లేషణతో ఆకట్టుకుంటోంది. తాజాగా, క్రికెట్ లోనూ చాట్ జీపీటీ తన ప్రతిభను ప్రదర్శించే ప్రయత్నం చేసింది. భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ కు వచ్చినప్పుడు ఫీల్డింగ్ మోహరింపులు ఎలా ఉంటాయో చెప్పింది.

ధోనీ బరిలో దిగినప్పుడు, అతడు హుక్, పుల్ షాట్లు ఆడకుండా ప్రత్యర్థి కెప్టెన్లు డీప్ స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్ లో ఫీల్డర్లను పెడతారని చాట్ జీపీటీ వెల్లడించింది. అంతేకాదు, స్ట్రెయిట్ షాట్లు కొట్టడంలో దిట్ట అయిన ధోనీని నిలువరించడానికి లాంగాన్, లాంగాఫ్ లోనూ కచ్చితంగా ఫీల్డింగ్ సెట్ చేస్తారని... అతడు ఆడే డ్రైవ్ షాట్లు, కట్ షాట్లను అడ్డుకోవడానికి కవర్, మిడాఫ్, బ్యాక్ వర్డ్ పాయింట్ ప్లేసులో ఫీల్డర్లు ఉండేలా చూసుకుంటారని వివరించింది. 

కానీ, ఈ సెటప్ తో ధోనీని ఎక్కువసేపు నియంత్రించలేమని, అతడు వెంటనే వ్యూహానికి ప్రతివ్యూహం పన్ని బ్యాటింగ్ ను మార్చుకుంటాడని చాట్ జీపీటీ పేర్కొంది. 

ఇక, తాను కీపింగ్ చేస్తుండగా ఇతర టీముల బ్యాట్స్ మన్లు వచ్చినప్పుడు వారిని ఉచ్చులో పడేయడానికి ధోనీ ఎలాంటి ఫీల్డింగ్ ప్లాన్లు అమలు చేస్తాడో కూడా జీపీటీ వెల్లడించింది. ఒక స్లిప్, ఒక గల్లీ, ఒక షార్ట్ లెగ్ తో ఒక ఫీల్డింగ్ వ్యూహం అమలు చేస్తాడని... డీప్ స్క్వేర్ లెగ్, డీప్ ఫైన్ లెగ్ లో ఫీల్డర్లను పెట్టి పుల్, హుక్ షాట్లు ఆడకుండా కట్టడి చేస్తాడని చాట్ జీపీటీ వెల్లడించింది. 

ఏ బ్యాట్స్ మన్ అయినా ఎక్కువగా ఆడేది లాఫ్టెడ్ షాట్లే కాబట్టి లాంగాన్, లాంగాఫ్ లో ఫీల్డర్లు కచ్చితంగా ఉండేలా చూసుకుంటాడని వివరించింది. అయితే, ప్రత్యర్థి బ్యాటర్ల ఆటను ధోనీ నిశితంగా గమనిస్తుంటాడని, వారు ప్లాన్ మార్చుకుంటే, అందుకు తగ్గట్టు మరో ఎత్తుగడ వేస్తాడని తెలిపింది.

MS Dhoni
ChatGPT
Batting
Fielding
Cricket
  • Loading...

More Telugu News