ajay bhupathi: ‘మంగళవారం’ రోజున.. పాయల్ రాజ్ పుత్ బోల్డ్ లుక్!

ajay bhupathis mangalavaram movie first look poster out now
  • ‘మంగళవారం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న అజయ్ భూపతి
  • ‘శైలజ’ అనే పాత్రలో పాయల్ రాజ్ పుత్ కనిపిస్తుందని మేకర్స్ ప్రకటన 
  • ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. అర్ధనగ్నంగా పాయల్‌
‘ఆర్‌ఎక్స్‌100’.. ఐదేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా పెద్ద సంచలనమే సృష్టించింది. చిన్న చిత్రంగా విడుదలై పెద్ద హిట్ కొట్టింది. దర్శకుడు అజయ్ భూపతికి, హీరో కార్తికేయకు, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు విపరీతమైన పాప్యులారిటీ తెచ్చిపెట్టింది.

అయితే ఆ తర్వాత ముగ్గురికీ ఒక్క హిట్ కూడా పడలేదు. కార్తికేయ, పాయల్ పలు సినిమాలు చేసినా.. పెద్దగా ఆడలేదు. సిద్ధార్థ్‌, శర్వానంద్‌తో అజయ్ భూపతి తెరకెక్కించిన మల్టీస్టారర్‌ ‘మహా సముద్రం’.. బాక్సాఫీస్‌ దగ్గర తేలిపోయింది.

ఈ నేపథ్యంలో తనకు హిట్టిచ్చిన బోల్డ్‌ జానర్‌లో, పాయల్ రాజ్ పుత్ తో ‘మంగళవారం’ అనే సినిమాను అజయ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా హీరోయిన్‌ పోస్టర్‌ను రివీల్‌ చేశారు.

ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ ‘శైలజ’ అనే పాత్రలో కనిపిస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ఓ బోల్డ్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘శైలు.. చాలాకాలం మీ గుండెల్లో ఉండిపోతుంది’’ అని అజయ్ ట్వీట్ చేశారు. అర్ధనగ్నంగా ఉన్న పాయల్‌ రాజ్‌పుత్‌ పోస్టర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. పోస్టర్‌లో పాయల్‌ వేలిపై సీతాకోకచిలుక, కంట్లో నీళ్లు కనిపించాయి.

గ్రామీణ నేపథ్యంలో 1990లో జరిగే కథ ఇదని తెలుస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇండియాలో సినిమా రాలేదని అజయ్‌ భూపతి చెప్పుకొచ్చారు. సినిమాలో ముప్పై పాత్రలున్నాయని, ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉంటుందని తెలిపారు. షూటింగ్‌ చివరిదశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ajay bhupathi
mangalavaram
payal rajput
first look poster
bold look

More Telugu News