Ram Gopal Varma: 'నిజం'... యూట్యూబ్ చానల్ ప్రారంభిస్తున్న రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma set launch Nijam youtube channel

  • ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం
  • వివేకా హత్యోదంతంపై తొలి ఎపిసోడ్
  • అబద్ధాల బట్టలు ఊడదీస్తానంటున్న వర్మ
  • అప్పుడే నిజం బయటపడుతుందని వెల్లడి
  • నిజాన్ని గౌరవించేవాళ్లకు తన చానల్ గొడుగు కింద స్థానం ఉంటుందని ప్రకటన

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యూట్యూబ్ చానల్ ప్రారంభించబోతున్నారు. ఈ చానల్ పేరు 'నిజం'. ఈ చానల్ ప్రారంభోత్సవానికి ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. తన యూట్యూబ్ చానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలు ఊడదీసి నిజాన్ని ఆవిష్కరించడమేనని వర్మ తెలిపారు. 

'నిజం' యూట్యూబ్ చానల్ లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీలు మాత్రమే కాకుండా, కొన్ని కరెంట్ సిట్యుయేషన్స్, సైన్స్, హిస్టరీ, కృత్రిమ మేథ, సెక్స్, ఫిలాసఫీ, పోలీస్, క్రైమ్, న్యాయస్థానాలు... ఇలా ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయని వివరించారు. 

కాగా, సీనియర్ పాత్రికేయురాలు స్వప్న కూడా కొన్ని ఎపిసోడ్స్ లో పాల్గొంటారని, కొన్ని అంశాలను తాను విశ్లేషిస్తానని, కొన్ని అంశాలు స్వప్న విశ్లేషిస్తారని వర్మ వెల్లడించారు. నిజాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ 'నిజం' చానల్ గొడుగు కింద ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. 

తన యూట్యూబ్ చానల్ లో తొలి ఎపిసోడ్ ను 'వివేకా హత్య వెనుక నిజంలో అబద్ధముందా?' అనే టాపిక్ పై ఉంటుందని వెల్లడించారు. తన చానల్ లోగోను కూడా వర్మ ఆవిష్కరించారు.

Ram Gopal Varma
Nijam
Youtube Channel
  • Loading...

More Telugu News