Twitter: ట్విట్టర్ అప్డేట్.. వీళ్లందరికీ బ్లూ టిక్ ఉచితం!

Twitter blue tick is free for those who have more than 10 laks followers
  • 10 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్న వారికి ఉచితంగా బ్లూటిక్ ఇవ్వాలని మస్క్ నిర్ణయం
  • పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులుకు మళ్లీ వచ్చిన బ్లూ టిక్
  • బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాలని రూల్ పెట్టిన ట్విట్టర్
ట్విట్టర్ లో బ్లూ టిక్ కోసం డబ్బులు చెల్లించని ఎంతో మంది సెలబ్రిటీలు, ప్రముఖులు బ్లూ టిక్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో చాలామందికి బ్లూటిక్ మళ్లీ వచ్చేసింది. 10 లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్న ప్రతి ఒక్కరికీ బ్లూటిక్ ఉచితంగా ఇవ్వాలని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ నిర్ణయించారు. దీంతో, 10 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్న అందరికీ మళ్లీ ఉచితంగా బ్లూ టిక్ వచ్చింది. మరోవైపు బ్లూటిక్ కావాలనుకునేవారు నెలకు 8 డాలర్లు చెల్లించాలని ట్విట్టర్ రూల్ పెట్టిన సంగతి తెలిసిందే. డబ్బులు చెల్లించని వారి బ్లూ టిక్ లను ఈ నెల 20న తొలగించారు.
Twitter
Blue Tick

More Telugu News