Sachin Tendulkar: ఐపీఎల్‌లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్జున్ టెండూల్కర్.. వీడియో ఇదిగో

Arjun Tendulkar joint most expensive IPL 2023 over in MI vs PBKS

  • ఒకే ఓవర్‌లో 31 పరుగులు సమర్పించుకున్న అర్జున్
  • ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో ముంబై బౌలర్‌గా చెత్త రికార్డు
  • తొలి స్థానంలో డేనియల్ శామ్స్

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జూనియర్ సచిన్ అర్జున్ టెండూల్కర్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్ అద్భుతంగా వేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. తాను వేసిన 13వ ఓవర్‌లో ఏకంగా 31 పరుగులు ఇచ్చుకున్నాడు. ఫలితంగా ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో ముంబై బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గత  సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేనియల్ శామ్స్ ఒకే ఓవర్‌లో 35 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుడు 31 పరుగులతో అర్జున్ టెండూల్కర్ అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో ముగ్గురు బౌలర్లు ఉన్నారు. 2014లో బెంగళూరుపై పవన్ సుయాల్, 2019లో రాజస్థాన్ రాయల్స్‌పై అల్జారీ జోసెఫ్, 2017లో పంజాబ్ కింగ్స్‌పై మిచెల్ మెక్ క్లెనాన్ 28 పరుగుల చొప్పున ఇచ్చుకున్నారు. 

నిజానికి పంజాబ్‌తో మ్యాచ్‌లో అర్జున్ తన బౌలింగ్‌ను బ్రహ్మాండంగా ప్రారంభించాడు. తొలి ఓవర్‌లోనే జోరుమీదున్న ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను వెనక్కి పంపాడు. ఐపీఎల్‌లో అర్జున్‌కి ఇది రెండో వికెట్. అయితే, ఆ తర్వాత 16వ ఓవర్ వేసిన అర్జున్ ఎడాపెడా పరుగులు ఇచ్చుకున్నాడు. అర్జున్ వేసిన తొలి బంతినే శామ్ కరన్ స్టాండ్స్‌లోకి పంపి ఉద్దేశాన్ని చాటిన పంజాబ్ కెప్టెన్.. ఆ తర్వాత కూడా ఫోర్లు, సిక్సర్‌తో విరుచుకుపడి 31 పరుగులు పిండుకున్నాడు. ఇందులో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు, ఓ నోబాల్ ఫోర్, వైడ్ ఉన్నాయి. మొత్తంగా మూడు ఓవర్లు వేసిన అర్జున్ ఒక వికెట్ తీసుకుని 48 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇందులో ఒక నోబాల్, 4 వైడ్లు కూడా ఉన్నాయి.

Sachin Tendulkar
Arjun Tendulkar
IPL 2023
MI
PBKS
  • Loading...

More Telugu News