'విరూపాక్ష' విజయం .. సాయితేజ్ కి కంగ్రాట్స్ చెప్పిన చరణ్!
- బలమైన కథాకథనాలతో వచ్చిన 'విరూపాక్ష'
- విడుదల రోజునే వచ్చిన హిట్ టాక్
- సాయితేజ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు
- వీకెండు మరింతగా వసూళ్లు పెరిగే ఛాన్స్
కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి టాక్ వస్తుండటం పట్ల మెగాస్టార్ సంతోషాన్ని వ్యక్తం చేయడం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాతో హిట్ అందుకున్నందుకు సాయితేజ్ కి ట్విట్టర్ ద్వారా చరణ్ అభినందనలు తెలియజేశాడు.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజున 12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రెండో రోజున వసూళ్లు పెరిగినట్టుగా చెబుతున్నారు. ఇక ఆదివారం కూడా ఈ సినిమా వసూళ్లు ఒక రేంజ్ కి చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి వసూళ్ల పరంగా ఈ సినిమా వసూళ్లు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తాయేమో.