Ravi Shastri: తండ్రికి లేని రికార్డును అర్జున్ టెండూల్కర్ సొంతం చేసుకున్నాడు: రవిశాస్త్రి

Ravi Shastri lauds Arjun Tendulker for his last over bowling against SRH

  • ఇటీవల ఐపీఎల్ అరంగేట్రం చేసిన సచిన్ తనయుడు
  • సన్ రైజర్స్ తో మ్యాచ్ లో తొలి వికెట్ అందుకున్న అర్జున్ టెండూల్కర్
  • సచిన్ ఐపీఎల్ లో ఒక్క వికెట్ కూడా తీయలేదన్న రవిశాస్త్రి
  • ఆఖరి ఓవర్ ఎలా వేయాలన్నదానిపై అర్జున్ కు పూర్తి స్పష్టత ఉందని వెల్లడి
  • యార్కర్లు అద్భుతంగా వేశాడని కితాబు

బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ముంబయి ఇండియన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్  మ్యాచ్ లో చివరి ఓవర్ వేసిన అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఓ వికెట్ కూడా సాధించాడు. దీనిపై క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి స్పందించారు. 

తండ్రి సచిన్ టెండూల్కర్ కు లేని రికార్డును తనయుడు అర్జున్ టెండూల్కర్ సాధించాడని కొనియాడారు. సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడని, కానీ అర్జున్ మాత్రం ఓ వికెట్ తీశాడని వివరించారు. 

కాగా, సన్ రైజర్స్ పై చివరి ఓవర్ ను ఎలా వేయాలన్నదానిపై అర్జున్ టెండూల్కర్ కు పూర్తి స్పష్టత ఉందని రవిశాస్త్రి విశ్లేషించారు. పేస్ ను ఎప్పటికప్పుడు మార్చాడని, కచ్చితత్వంతో కూడిన యార్కర్లను ప్రతిభావంతంగా సంధించాడని అభినందించారు.

Ravi Shastri
Arjun Tendulkar
Sachin Tendulkar
Mumbai Indians
SRH
IPL
  • Loading...

More Telugu News