Sachin Tendulkar: బ్లూటిక్ లేకపోతే నీవు నిజమైన సచిన్ అని ఎలా గుర్తించాలి?: ఓ అభిమాని ప్రశ్న

Sachin Tendulkar response to fan on losing Twitter blue tick is pure gold Seen yet

  • ట్విట్టర్ లో సచిన్ టెండుల్కర్ కు ఎదురైన ప్రశ్న
  • ఇప్పటికి ఇదే నా బ్లూటిక్ అంటూ నవ్వు సింబల్ చూపించిన టెండుల్కర్
  • ఇది మరీ కచ్చితత్వంగా ఉందన్న ఓ యూజర్

అధికారిక ఖాతా అని గుర్తించేందుకు చిహ్నంగా బ్లూటిక్ ను ట్విట్టర్ తీసుకొచ్చింది. సామాన్యులకు చందా కట్టడం భారం అంటే నమ్మొచ్చు. కానీ సెలబ్రిటీలు అయి ఉండి, కోట్లాది ఆదాయం, ఆస్తులున్న వారు కూడా వందలాది రూపాయల చందా కట్టడం ఇష్టం లేక పొదుపు తనం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పొదుపరుల జాబితాలో ఎంతో మంది దిగ్గజాలు, ఐశ్వర్యవంతులు కూడా ఉన్నారు. అందులో భారతరత్న పురస్కార గ్రహీత సచిన్ టెండుల్కర్ కూడా చేరిపోయారు.

ఈ నెల 20 నుంచి చందా కట్టని వారి ట్విట్టర్ ఖాతాల నుంచి బ్లూ టిక్ కనిపించకుండా పోయింది. అందులో సచిన్ టెండుల్కర్ ఖాతా కూడా ఉంది. బ్లూ టిక్ ఉంటే అది సచిన్ ఖాతానే అని తెలుసుకోవడం సులభం. మరి బ్లూ టిక్ లేకపోతే అది సచిన్ ఖాతానా? లేక మరొకరు క్రియేట్ చేసిన నకిలీదా? ఎలా తెలుసుకోవాలి? ఇదే సందేహం ఓ అభిమానికి ఎదురైంది. సచిన్ టెండుల్కర్ ట్విట్టర్ లో ‘నన్ను ఏదైనా అడగొచ్చు’ అనే సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని సచిన్ ను బ్లూ టిక్ పై ప్రశ్నించాడు. 

‘‘ఇప్పుడు నీకు బ్లూ టిక్ లేదు. అలాంటప్పుడు నీవు అసలైన సచిన్ అని మేము ఎలా నమ్మాలి? అని అభిషేక్ అనే యూజర్ ప్రశ్నించాడు. దీనికి సచిన్ ఊహించని విధంగా బదులిచ్చారు. ఇప్పటికి అయితే ఇదే నా బ్లూటిక్ వెరిఫికేషన్ అంటూ నవ్వు సింబల్ మాదిరిగా చేయిని చూపించాడు. నిజమే ఇది మరీ ఆథెంటిక్ గా ఉందని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

Sachin Tendulkar
response
blue tick
Twitter
user
fan
  • Loading...

More Telugu News