Venkatesh Daggubati: ‘సైంధవ్’లో చిలసౌ హీరోయిన్.. లుక్ రిలీజ్ చేసిన వెంకీ!

Ruhani Sharma in SAINDHAV as doctor Renu poster released by venkatesh

  • వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘సైంధవ్’
  • ఫిమేల్ లీడ్‌ రోల్‌లో కనిపించనున్న శ్రద్ధా శ్రీనాథ్‌ 
  • మరో హీరోయిన్ గురించి అప్ డేట్ ఇచ్చిన మేకర్స్ 
  • డాక్టర్ రేణుగా రుహానీ శర్మ కనిపించనున్నట్లు ప్రకటన

విక్టరీ వెంకటేశ్ చాలా కాలం తర్వాత యాక్షన్‌ మోడ్ లోకి మారిపోయారు. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సైంధవ్‌’. ‘హిట్’ సిరీస్ లతో సూపర్ హిట్లు కొట్టిన శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ ఫిమేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఇటీవల ఈమె క్యారెక్టర్ ను రివీల్ చేశారు. 

తాజాగా మరో హీరోయిన్ గురించి మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. కీలక పాత్రలో కనిపించబోయే రేణు ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చారు. డాక్టర్ రేణుగా ‘చిలసౌ’ సినిమా ఫేమ్ రుహానీ శర్మ కనిపించబోతున్నట్లు ప్రకటించారు. రుహానీ శర్మకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను వెంకటేశ్ రిలీజ్ చేశారు.

వెంకటేశ్‌ 75వ సినిమాగా తెరకెక్కుతున్న సైంధవ్‌ గ్లింప్స్ ఇటీవల రిలీజ్ చేయగా.. అందరినీ ఆకట్టుకుంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు శైలేశ్ - నాని చిట్ చాట్‌ ద్వారా వెల్లడైంది. 2023 డిసెంబర్‌ 22న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సైంధవ్ విడుదల కానుంది.

Venkatesh Daggubati
SAINDHAV
Ruhani sharma
Sailesh Kolanu
Nawazuddin Siddiqui
  • Loading...

More Telugu News