Mammootty: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇంట విషాదం

actor Mammoottys mother Fathima Ismail passes away
  • మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ కన్నుమూత
  • కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
  • కొట్టాయం జిల్లాలోని చెంబులో ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు
మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) కన్నుమూశారు. కొంత కాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఫాతిమా ఇస్మాయిల్‌.. కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

 ఆమె మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు మమ్ముట్టి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. మమ్ముట్టి తల్లి అంత్యక్రియలు కొట్టాయం జిల్లాలోని చెంబులో ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మమ్ముట్టితోపాటు ఆమెకు కొడుకులు ఇబ్రహీం కుట్టి, జకారియా, కూతుర్లు అమీనా, సౌదా, షఫీనా ఉన్నారు.

దాదాపు ఐదు దశాబ్దాలుగా మలయాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మమ్ముట్టి కొనసాగుతున్నారు. తెలుగులో స్వాతి కిరణం, యాత్ర వంటి చిత్రాలతో, మరెన్నో డబ్బింగ్ సినిమాలతో పాప్యులారిటీ తెచ్చుకున్నారు. మరో వారంలో విడుదల కాబోతున్న అఖిల్ ‘ఏజెంట్‌’ సినిమాలోనూ మమ్ముట్టి కీలకపాత్ర పోషించారు. ఇక మమ్ముట్టి కొడుకు దుల్కర్‌ సల్మాన్‌ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘మహానటి’ ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. గతేడాది ‘సీతారామం’తో సూపర్ హిట్ అందుకున్నారు.
Mammootty
Dulquer Salmaan
Fathima Ismail

More Telugu News