Suryanarayana: ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకు మరోసారి నోటీసులు

AP Govt notices to employees union president Suryanarayana

  • వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసులు
  • గతంలో కూడా నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం
  • గతంలో ఆందోళన సందర్భంగా ఉన్నతాధికారిని దిగ్బంధించి ఆందోళన

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. సూర్యనారాయణ అధ్యక్షుడిగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి గతంలో అడిషనల్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కమిషనర్ కార్యాలయం వెలుపల ఉన్నతాధికారిని దిగ్బంధించి ఆందోళన చేయడంపై సంజాయషీ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. తాజా నోటీసుల్లో సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఆదేశించింది.

Suryanarayana
Govt Employees Union
Notice
  • Loading...

More Telugu News