Dastagiri: సీఎం జగన్, అవినాశ్ రెడ్డిల నుంచి నాకు ప్రాణహాని ఉంది: దస్తగిరి

I have death threat from Jagan and Avinash Reddy says Dasthagiri

  • తనను, తన కుటుంబాన్ని ఏమైనా చేస్తారనే భయం ఉందన్న దస్తగిరి
  • తగిన రక్షణ కల్పించాలని కడప ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు
  • సునీత నుంచి డబ్బులు తీసుకున్నానని అవినాశ్ ఆరోపిస్తున్నారని మండిపాటు

వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన ఆరోపణలు చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని ఏమైనా చేస్తారనే భయం తనకు ఉందని చెప్పారు. అవినాశ్ రెడ్డి మనుషులు తనను అనుసరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కడప ఎస్పీ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కోరారు. 

వివేకా కూతురు సునీత నుంచి తాను డబ్బులు తీసుకున్నట్టు అవినాశ్ రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నారని అన్నారు. తాను అమ్ముడుపోయానని నిరూపిస్తే జైలు శిక్షకు సిద్ధమని, నిరూపించకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్తారా? అని ప్రశ్నించారు. తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని సీబీఐ ఎస్పీ, రాయలసీమ రేంజ్ డీఐజీకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా వినతులు అందజేస్తానని చెప్పారు.

Dastagiri
YS Vivekananda Reddy
YS Avinash Reddy
Jagan
YSRCP
  • Loading...

More Telugu News