Arjun Tendulkar: నాన్న నాకు చెప్పేది అదే..: అర్జున్ టెండుల్కర్

He Tells Me To Arjun Tendulkar On Father Sachin Advice As He Takes His 1st IPL Wicket

  • సాధనకు తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని చెబుతారన్న అర్జున్
  • జట్టు ప్రణాళిక మేరకు బౌలింగ్ చేస్తానని ప్రకటన
  • తాను కేవలం తన డెలివరీపైనే దృష్టి పెడతానని వ్యాఖ్య  

బౌలింగ్ చేయడాన్ని తాను ఎంతో ప్రేమిస్తానని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ప్రకటించాడు. తన ఐపీఎల్ కెరీర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై తొలి వికెట్ తీసిన అర్జున్ టెండుల్కర్, మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడాడు. 

‘‘కెప్టెన్ ఆదేశాల మేరకు ఏ సమయంలో అయినా బౌలింగ్ చేయడానికి ఇష్టపడతాను. టీమ్ ప్రణాళికకు అనుగుణంగా ఉండడం ద్వారా నా వంతు ఉత్తమ ఫలితాన్ని ఇచ్చేందుకు కష్టపడతాను. మేము (సచిన్, అర్జున్)  క్రికెట్ గురించి మాట్లాడుకుంటాం. గేమ్ కు ముందు వ్యూహాలపై చర్చిస్తాం. ప్రతి ఆటలోనూ సాధనకు తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని నాన్న నాకు చెబుతారు. నేను కేవలం నా డెలివరీపైనే దృష్టి పెడతాను’’ అని అర్జున్ చెప్పాడు.

చివరి ఓవర్ కు సంబంధించి కార్యాచరణను కూడా వెల్లడించాడు. ‘‘మొదటి ఐపీఎల్ వికెట్ సాధించడం గొప్ప విషయం. నా చేతుల్లో ఉన్న దానిపైనే దృష్టి పెడతాను. అనుకున్న ప్రణాళికను అమల్లో పెడతాను. వైడ్ వేసి లాంగ్ బౌండరీకి బ్యాటర్ ప్రయత్నించేలా చేయాలన్నది మా ప్రణాళిక’’ అని వివరించాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అర్జున్ టెండుల్కర్ గురించి మాట్లాడాడు. ‘‘అర్జున్ మా జట్టుతో మూడేళ్లుగా ఉన్నాడు. అతడు ఏం చేయాలన్నది అతడికి తెలుసు. ఎంతో నమ్మకంతో ఉంటాడు. తన ప్రణాళికల పట్ల స్పష్టతతో ఉంటాడు. డెత్ ఓవర్లలో కొత్త బంతితో స్వింగ్, యార్కర్లు సంధించగలడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

Arjun Tendulkar
Father
Sachin Tendulkar
Advice
  • Loading...

More Telugu News