Sachin Tendulkar: చివరికి ఓ వికెట్ చిక్కింది: సచిన్ టెండుల్కర్

  • ట్విట్టర్ లో స్పందించిన సచిన్ టెండుల్కర్
  • ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శనకు ప్రశంసలు
  • చివరిగా కుమారుడి తొలి వికెట్ ప్రస్తావన
Finally a Tendulkar picks up an IPL wicket Sachin thrilled for son Arjun last over heroics for MI vs SRH

సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ కెరీర్ లో తొలి వికెట్ తీశాడు. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో చివరి ఓవర్లో వికెట్ తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీనిపై సచిన్ టెండుల్కర్ ట్విట్టర్లో స్పందించాడు.

‘‘ముంబై ఇండియన్స్ మరోసారి ఆల్ రౌండ్ ప్రదర్శన చేసింది. కామెరాన్ గ్రీన్ బ్యాట్ తో, బాల్ తో మెప్పించే ప్రదర్శన ఇచ్చాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ బ్యాటింగ్ ఎప్పటిలాగే గొప్పగా ఉంది. ఐపీఎల్ ప్రతిరోజూ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. చివరికి ఓ టెండుల్కర్ ఐపీఎల్ వికెట్ దక్కించుకున్నాడు’’ అని సచిన్ ట్వీట్ చేశాడు. 

అర్జున్ టెండుల్కర్ గత మూడు సీజన్లుగా ముంబై ఇండియన్స్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. కానీ, బౌలింగ్ చేసే అవకాశం రావడం ఈ సీజన్ లోనే మొదలైంది. గత వారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలిసారి ఐపీఎల్ లో బౌలింగ్ చేశాడు. ఇప్పుడు తొలి వికెట్ దక్కించుకున్నాడు. సచిన్ టెండుల్కర్ ముంబై ఇండియన్స్ టీమ్ మెంటార్ గా కొనసాగుతుండడం తెలిసిందే.

More Telugu News