tilak varma: హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ ఇంట్లో ముంబై ఇండియన్స్ స్టార్ల సందడి

mumbai indians visits tilak varma house in hyderabad

  • సన్ రైజర్స్ తో మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన ముంబై ఇండియన్స్ టీమ్
  • నిన్న రాత్రి డిన్నర్ ఇచ్చిన తిలక్ వర్మ.. ఫొటోలు వైరల్
  • ఈ అద్భుతమైన రోజును తాను, తన కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామన్న తిలక్

సన్ రైజర్స్ టీమ్ తో మ్యాచ్ కోసం హైదరాబాద్ కు వచ్చిన ముంబై ఇండియన్స్ టీమ్ తిలక్ వర్మ ఇంట్లో సందడి చేసింది. సచిన్, రోహిత్ శర్మ, పియుష్ చావ్లా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అర్జున్ టెండూల్కర్ సహా ముంబై ఆటగాళ్లు తిలక్ వర్మ ఇంటికి వెళ్లారు. అతని ఇంట్లో డిన్నర్ కూడా చేశారు. తర్వాత తిలక్ కుటుంబసభ్యులతో కలిసి ముంబై ఆటగాళ్లు ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ముంబై టీమ్ స్టార్లు తన ఇంటికి రావడంపై తిలక్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘నా ‘ఎంఐ పల్టన్‌’ ఫ్యామిలీకి మా ఇంట్లో డిన్నర్‌ పార్టీ ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుతమైన రోజును నేను, నా కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. మా ఇంటికి వచ్చిన ఎంఐకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశాడు.

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న తిలక్ వర్మ.. ఈ సీజన్ లో అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్ లోనే 84 పరుగులు చేశాడు. తర్వాత 22, 41, 30 స్కోర్లతో జట్టును ఆదుకున్నాడు. వరుసపెట్టి వికెట్లు పడుతున్నా.. అడ్డుగా నిలిచి జట్టును గట్టెక్కిస్తున్నాడు. అతి తక్కువ కాలంలోనే సచిన్, సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు.

tilak varma
mumbai indians
sunrisers hyderabad
Sachin Tendulkar
Rohit Sharma
  • Loading...

More Telugu News