nuts: సీడ్స్ ను వేయించకుండా తింటున్నారా..?

Why you shouldnt consume flaxseeds or pumpkin seeds without roasting

  • ముడి సీడ్స్ లో ఫైటేట్స్ ఉంటాయ్
  • ఇవి పోషకాలు మన శరీరానికి పట్టకుండా అడ్డు పడతాయ్
  • రోస్ట్ చేసుకుని, నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు
  • సీడ్స్, నట్స్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

నట్స్, సీడ్స్ ను సూపర్ ఫుడ్స్ గా పోషకాహార నిపుణులు చెబుతుంటారు. కనుక ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ వీటిని తీసుకుంటూ ఉండాలి. రోజువారీ తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించుకోవచ్చని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. 

గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, అవిసె గింజలు తదితర సీడ్స్ లో మైక్రో న్యూట్రియంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిల్లో గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అన్ని ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వీటి రూపంలో పొందొచ్చు. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడేవే. కాకపోతే ఈ సీడ్స్ ను సరైన మోతాదులో, సరైన తీరులో తీసుకున్నప్పుడే ప్రయోజనాలు నెరవేరతాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. రక్తపోటు పెరగకుండా చూసుకోవచ్చు. 

ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నాన్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తాయి. హెంప్ సీడ్స్ లో ప్రొటీన్ ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్, సిసేమ్, పంప్ కిన్, సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఫైబర్, లిగ్నాన్లు, యాంటీ న్యూట్రియంట్లు ఉంటాయి. కనుక వీటిని రోస్ట్ చేసుకునే తినాలి. వేయించుకోకుండా తింటే.. ఇవి సరిగ్గా జీర్ణం కావు. అజీర్ణంతో కడుపులో నొప్పికి దారితీస్తాయి. నీటిలో నాన బెట్టకుండా లేదా వేయించకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ముడి సీడ్స్ ను అలానే తినడం వల్ల వాటిల్లో ఉండే ఫైటేట్స్ అనేవి సీడ్స్ లోని మినరల్స్, విటమిన్స్ మన శరీరానికి అందకుండా అడ్డు పడతాయి. కనుక వీటిని వేటికవే విడిగా రోస్ట్ చేసుకుని, గాలిచొరబడని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. పౌడర్ చేసుకుని తినడం వల్ల జీర్ణ పరమైన సమస్యలు రావు.

nuts
seeds
health benefits
nutrients
roasted
how to consume
  • Loading...

More Telugu News