Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ కు టిమ్ డేవిడ్ ప్రశంసలు

Arjun Tendulkar did a great job in his first IPL match says Tim David

  • తొలి ఓవర్ అద్భుతంగా వేశాడన్న ముంబై ఇండియన్స్ బ్యాటర్
  • అది అతడిలో నమ్మకాన్ని పెంచుతుందన్న అభిప్రాయం
  • మొదటి మ్యాచ్ లోనే ఆకట్టుకున్నాడంటూ ప్రశంస

దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు ముంబై బ్యాటర్ టిమ్ డేవిడ్ మద్దతు పలికాడు. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్ కతా, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అర్జున్ మొదటిసారి తన బౌలింగ్ ప్రతిభను ప్రదర్శించడం చూసే ఉంటారు. ఈ మ్యాచ్ లో కోల్ కతాను ముంబై ఓడించింది. మొదట కోల్ కతా జట్టు బ్యాటింగ్ చేయగా.. ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ మొదలుపెట్టాడు. 

మ్యాచ్ ముగిసిన తర్వాత టిమ్ డేవిడ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అర్జున్ టెండూల్కర్ ను టిమ్ డేవిడ్ ప్రశంసించాడు. అరంగేట్ర మ్యాచ్ లోనే యువ ప్లేయర్ ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు. ‘‘అతడు బంతితో తొలి ఓవర్ చక్కగా వేశాడన్నది నా అభిప్రాయం. నేను ఆ సమయంలో అతడిని పక్క నుంచే గమనించాను. బంతిని స్వింగ్ చేశాడు. అది అతడికి ఎంతో అద్భుతం. సదరు పనితీరు ద్వారా అతడు ఎంతో నమ్మకాన్ని తెచ్చుకున్నాడు’’ అని టిమ్ డేవిడ్ తన అభిప్రాయాలు షేర్ చేసుకున్నాడు. పనిలో పనిగా కోల్ కతా జట్టు సభ్యుడు వెంకటేష్ అయ్యర్ పనితీరునూ టిమ్ డేవిడ్ మెచ్చుకున్నాడు. వెంకటేష్ అయ్యర్ నిన్నటి మ్యాచులో సెంచరీ సాధించడం తెలిసిందే. అయినా, తాము ఆ ప్రభావాన్ని అధిగమించి విజయం సాధించడం సంతోషంగా ఉందన్నాడు.

Arjun Tendulkar
mumbai indians
arjun tendulkar
Sachin Tendulkar
  • Loading...

More Telugu News