YS Bhaskar Reddy: వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

  • వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్
  • హైదరాబాద్ తరలించిన సీబీఐ అధికారులు
  • ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
  • సీబీఐ జడ్జి ఎదుట హాజరు
  • ఈ నెల 29 వరకు రిమాండ్
  • భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించిన అధికారులు
14 Days remand for YS Bhaskar Reddy

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రిని సీబీఐ అధికారులు ఈ ఉదయం అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ మధ్యాహ్నం పులివెందుల నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఆయనను సీబీఐ అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

అనంతరం సీబీఐ న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లారు. భాస్కర్ రెడ్డిని సీబీఐ జడ్జి ఎదుట హాజరు పరిచారు. వైద్య పరీక్షల నివేదికను జడ్జికి సమర్పించారు. అన్ని వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి... వైఎస్ భాస్కర్ రెడ్డికి  14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 29 వరకు భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధిస్తున్నట్టు సీబీఐ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో, వైఎస్ భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. 

దీనిపై భాస్కర్ రెడ్డి న్యాయవాది మీడియాతో మాట్లాడారు. వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదని, దాంతో, ఆయనను జాగ్రత్తగా చూడాలని జైలు సూపరింటిండెంట్ కు న్యాయమూర్తి చెప్పారని వెల్లడించారు.

More Telugu News