Devineni Uma: నాలుగేళ్లు ముద్దాయిని కాపాడిన జగన్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి: దేవినేని ఉమ

  • వివేకా హత్య కేసులో ముద్దాయిల అరెస్టుపై జగన్ నోరు తెరవాలన్న దేవినేని ఉమ
  • రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం ఇక నడవదని వ్యాఖ్య
  • నాలుగేళ్లు వేదాంతం చెప్పి ప్రజలను మభ్య పెట్టారని విమర్శ
tdp leader devineni uma fires on jagan govt

రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం ఇక నడవదని, ఆయన పని అయిపోయిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లు ముద్దాయిని కాపాడిన జగన్.. అసెంబ్లీలో ఒక కన్ను.. మరో కన్ను అని వేదాంతం చెప్పి ప్రజలను మభ్య పెట్టారని మండిపడ్డారు. 

ఆదివారం మీడియాతో దేవినేని ఉమ మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో ముద్దాయిల అరెస్టుపై జగన్ నోరు తెరవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, బూతుల మంత్రి కొడాలి నాని స్పందించాలని డిమాండ్ చేశారు. 

ప్రత్యేక హోదా కోసం రాష్ట్రాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో సగం వాటా తమవే అంటూ తెలంగాణ వారు వాదిస్తున్నారని.. అయినా జగన్ ప్రభుత్వం మూసుకుని కూర్చుందని ఎద్దేవా చేశారు. గోదావరి చింతలపూడి ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడకపోవడం హాస్యాస్పదమన్నారు.

More Telugu News