vintage cars: పాత కారును వదిలించుకోవద్దు.. జాగ్రత్త పరిస్తే రూ.వందల కోట్లు

Pricey vintage cars driving into investment portfolios

  • ఒక్కో కారు రూ..300 కోట్లకు పైనే
  • వేలంలో వీటికి ఊహించని డిమాండ్
  • తమ ఇంట్లో అలనాటి కారు ఒక్కటైనా ఉండాలన్న ఆకాంక్ష

కాలం గడిచే కొద్దీ విలువ తగ్గడం కాదు.. పెరుగుతూ పోతోంది. ఖరీదైన గత కాలం నాటి కార్లకు సంబంధించిన విషయం ఇది. ఇందుకు నిదర్శనంగా ఇటీవలి కాలంలో వేలంలో వాటికి పలికిన ధరలను ప్రస్తావించుకోవచ్చు. 1962 నాటి ఫెరారీ 250 జీటీవో కారు తెగ శబ్ధం చేస్తోందని భార్య గొడవ పెట్టడంతో 1972లో ఓ యజమాని దాన్ని విక్రయించేశాడు. కానీ, ఓ 50 ఏళ్లు గడిచిన తర్వాత అదే కారుకు పలికిన ధర వింటే షాక్ కు గురవ్వాల్సిందే.  2018లో ఇదే మోడల్ కారు వేలంలో 48 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. మన రూపాయిల్లో అయితే సుమారుగా రూ.400 కోట్లు.  

మరో ఉదాహరణ.. 2022లో 1955 నాటి మెర్సెడెజ్ బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ కూప్ 149 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు ఇప్పుడు పాతం కాలం నాటి వింటేజ్ కార్లపై భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గడిచిన దశాబ్ద కాలంలో వీటి ధరలు 185 శాతం పెరిగాయి. గత పదేళ్లలో లగ్జరీ వైన్, వాచీలు, ఆర్ట్  ధరలను మించి వింటేజ్ కార్ల ధరలు పెరగడం గమనించాలి. వింటేజ్ కార్ల తర్వాత అంతగా ధరలు పెరిగింది పాతం కాలం నాటి విస్కీలకే. ఈ వివరాలను నైట్ ఫ్రాంక్ 2023 వెల్త్ రిపోర్ట్ వెల్లడించింది. 

అన్ని వందల కోట్లు తగలేస్తున్నారు.. పిచ్చోళ్లా ఏంటి? అనుకోవద్దు. అంత పెట్టినా కానీ, వారికి లాభాలు వస్తున్నాయంటే పాత కాలం నాటి క్లాసిక్ కార్లకు ఉన్న ఆదరణ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. గతంలో పాప్యులర్ అయిన కార్లు ఇప్పుడు మార్కెట్లో లేకపోవడం, అలనాటి మోడల్ ఒక్కటైనా తమ ఇంట్లో ఉండాలని కోరుకునే వారు పెరుగుతుండడం పెట్టుబడిదారుల పంట పండిస్తోంది.

vintage cars
Pricey
huge demand
auction
high price
investors
wealthy
  • Loading...

More Telugu News