Space Tomatoes: అంతరిక్షంలో టమాట పంట.. కిందికి తీసుకొస్తున్న నాసా!

Tomatoes grown in space flying to Earth on Dragon spacecraft today

  • మీనియేచ‌ర్ గ్రీన్‌ హౌస్ ల్యాబ్‌లో ట‌మాటాల‌ను పండించిన వ్యోమగాములు
  • మూడు ర‌కాలుగా హార్వెస్ట్ చేసిన‌ట్లు నాసా ప్రకటన
  • ట‌మాటాల‌ను ఫ్రీజ్ చేసి, పోష‌క‌ విలువ‌ల‌ను టెస్టు చేసినట్లు వెల్లడి

అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో పండించిన ట‌మాటాల‌ను భూమికి తీసుకువ‌స్తున్న‌ట్లు నాసా వెల్ల‌డించింది. స్పేస్ ఎక్స్ సీఆర్ఎస్‌-27 కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఆ ట‌మాటాలు రవాణా చేయనున్నట్లు తెలిపింది. మొత్తంగా స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా సుమారు రెండు వేల కిలోల బ‌రువు ఉన్న వ‌స్తువుల్ని అంతరిక్షం నుంచి భూమి పైకి తీసుకురానున్నారు.

వ్యోమ‌గాములు అంత‌రిక్ష కేంద్రంలోని మీనియేచ‌ర్ గ్రీన్‌ హౌస్ ల్యాబ్‌లో ట‌మాటాల‌ను పండించారు.  90, 97, 104 రోజుల పాటు మూడు ర‌కాలుగా ట‌మాటాల‌ను హార్వెస్ట్ చేసిన‌ట్లు నాసా త‌న బ్లాగ్‌లో చెప్పింది. పండిన ట‌మాటాల‌ను ఫ్రీజ్ చేసి, వాటి పోష‌క‌ విలువ‌ల‌ను టెస్టు చేసినట్లు వివరించింది.

అంత‌రిక్షంలో పంట‌ల్ని పండించి.. వ్యోమ‌గాముల ఖ‌ర్చుల్ని త‌గ్గించే ఉద్దేశంతో నాసా ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే ఎలాంటి గార్డెన్ లేకుండా ల్యాబ్‌ల‌లోనే పంట‌ల్ని పండించే ఈ ప్రయోగాన్ని భూమి పైన కూడా చేయవచ్చని నాసా చెబుతోంది. 

మరోవైపు జ‌పాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీ (జేఏఎక్స్ఏ) త‌యారు చేసిన క్రిస్ట‌ల్స్‌ను కూడా ఐఎస్ఎస్ నుంచి తీసుకురానున్నారు. సోలార్ సెల్స్‌, సెమీకండ‌క్ట‌ర్ ఆధారిత అధ్య‌య‌నం కోసం ఆ క్రిస్ట‌ల్స్‌ను వాడ‌నున్నారు. మైక్రోగ్రావిటీలో సేక‌రించిన ర‌క్త న‌మోనాల‌ను కూడా తీసుకురానున్నారు. ఇవన్నీ ఫ్లోరిడాలోని కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి చేరనున్నాయి.

Space Tomatoes
NASA
Astronauts
International Space Station
SpaceX
  • Loading...

More Telugu News