Chiranjeevi: ఇద్దరు స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టిన మెగాస్టార్!

Chiranjeevi up comong movies

  • ముగింపు దశలో చిరూ 'భోళా శంకర్'
  •  ఆ తరువాత దర్శకుడిగా తెరపైకి వినాయక్ పేరు 
  • కృష్ణవంశీ కథకి మార్పులు చెప్పిన చిరంజీవి 
  • మెగాస్టార్ తో సినిమాకి ట్రై చేస్తున్న 'బింబిసార' డైరెక్టర్

చిరంజీవి నుంచి త్వరలో 'భోళా శంకర్' సినిమా రానుంది. చిరూ సరసన తమన్నా .. ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమాకి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి ఏయే దర్శకులతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ నేపథ్యంలో తెరపైకి వీవీ వినాయక్ - కృష్ణవంశీ పేర్లు వచ్చాయి. 2019లో అజిత్ హీరోగా చేసిన 'విశ్వాసం' సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాను వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేయాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నారు. అయితే క్రితం ఏడాది మలయాళంలో వచ్చిన మమ్ముట్టి మూవీ 'భీష్మ పర్వం' అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా రీమేక్ హక్కులను కూడా చరణ్ దక్కించుకున్నట్టు సమాచారం. 

ఈ రీమేక్ ను కూడా వినాయక్ అయితే బాగ్ హ్యాండిల్ చేస్తాడని మెగాస్టార్ భావిస్తున్నారట. దాంతో ఈ రెండు రీమేకులలో ముందుగా ఏది సెట్స్ పైకి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక గతంలోనే చిరంజీవికి కృష్ణవంశీ 'వందేమాతరం' అనే కథను వినిపించి ఉన్నాడు. అయితే చిరంజీవికి అప్పుడున్న కమిట్మెంట్స్ వలన ఆ కథను చేయడం కుదరలేదు. తాజాగా మరోసారి కథను విన్న చిరంజీవి కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక 'బింబిసార' డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ కూడా చిరంజీవితో సినిమా చేయడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. 

Chiranjeevi
VV Vinayak
Krishnavamshi
  • Loading...

More Telugu News