Sundar Pichai: గూగుల్ లో మరిన్ని లేఆఫ్స్.. హింట్ ఇచ్చిన సుందర్ పిచాయ్

More lay offs in Google says CEO Sundar Pichai

  • ఇప్పటికే 12 వేల మందిని తొలగించిన గూగుల్
  • రెండో రౌండ్ లేఆఫ్స్ ఉంటాయని ప్రకటించిన సుందర్ పిచాయ్
  • 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపే అవకాశం

టెక్ దిగ్గజం గూగుల్ లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జనవరిలో గూగుల్ ప్రకటించింది. ఇప్పుడు రెండో రౌండ్ లేఆఫ్స్ ఉంటాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. కంపెనీ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే అదనపు భారాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 

టెక్నికల్ గా అనుభవం ఉన్న వారికి ఎలాంటి సమస్య ఉండదని, ప్రాథమిక దశలో ఉన్నవారిని భరించడం మాత్రం కష్టమని అన్నారు. గూగుల్ ఎదిగేందుకు, కంపెనీలో పని చేసేందుకు చాలా అవకాశాలను సంస్థ ఇచ్చిందని.. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతే అది గూగుల్ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో మరో 10 వేల మందిని ఇంటికి పంపే అవకాశం ఉందని స్పష్టం చేశారు. సుందర్ పిచాయ్ ప్రకటనతో గూగుల్ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలయింది.

  • Loading...

More Telugu News