Corona Virus: దేశంలో ఎండ్‌మిక్ దశకు కొవిడ్-19.. మరో 12 రోజులపాటు కరోనా విజృంభణ!

Covid In Endemic Stage In India Cases To Rise For 12 Days

  • 12 రోజుల తర్వాత కరోనా తగ్గుముఖం
  • ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ. 1.16 కారణంగా పెరుగుతున్న కేసులు
  • మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా

దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. అయితే, వైరస్ ఆటలు మరెన్నో రోజులు సాగవని, గరిష్ఠంగా మరో 12 రోజులపాటు వైరస్ ఉద్ధృతి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో కొవిడ్ ఎండ్‌మిక్ దశకు చేరుకుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసుల ఉద్ధృతి మరో 12 రోజులపాటు కొనసాగుతుందని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.

దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్, దాని ఉపరకం ఎక్స్‌బీబీ. 1.16 కారణమని, కేసుల పెరుగుదల వేగంగా ఉన్నప్పటికీ వైరస్ తీవ్రత మాత్రం తక్కువగా ఉందని అంటున్నారు. ఆసుపత్రిలో చేరికలు, మరణాలు పెరుగుతున్న దాఖలాలు కూడా లేవు. కాగా, నిన్న దేశవ్యాప్తంగా 7,830 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 40 వేలకు చేరుకున్నాయి. అలాగే, కరోనా కారణంగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11 మంది మరణించారు. ఒక్క మహారాష్ట్రలోనే 9 మంది మరణించగా, 1,115 మంది కరోనాకు గురయ్యారు.

Corona Virus
COVID19
Covid Endemic
India
Maharashtra
  • Loading...

More Telugu News