Dil Raju: ప్రభాస్ తర్వాతి సినిమాపై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన దిల్ రాజు

dil raju confirms prabhas and prashanth neel will make film after salaar

  • ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ చేస్తున్న ప్రభాస్
  • వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం ఉంటుందన్న దిల్ రాజ్
  • అది కూడా పౌరాణికమని, స్క్రిప్ట్ సిద్ధమైందని వెల్లడి

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తర్వాతి సినిమాపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్లు వెల్లడించారు. అది కూడా పౌరాణికమని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో ‘సలార్’ సినిమా భారీ ఎత్తున తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఇది పూర్తి కాగానే.. వీరిద్దరి కాంబినేషన్ లోనే మరో సినిమా వస్తుందని దిల్ రాజ్ తెలిపారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలోనే పౌరాణిక సినిమా రాబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేశారు. సలార్ తర్వాత.. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తారు. ఆ తర్వాత ప్రభాస్ సినిమా మొదలవుతుంది. అయితే ఈ చిత్రం ఇంకా చర్చల దశలో ఉంది’’ అని వివరించారు.

మరోవైపు సలార్ టీజర్ జూన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ సినిమా విడుదలైన వెంటనే.. టీజర్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Dil Raju
Prabhas
Prashanth Neel
Salaar
  • Loading...

More Telugu News