Allu Arjun: మీ ప్రేమకు కృతజ్ఞుడిని: అల్లు అర్జున్

Allu Arjun thanked those who wished on his birthday

  • నిన్న 41వ పుట్టిన రోజు జరుపుకున్న బన్నీ
  • సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ
  • తనను విష్ చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పిన ‘పుష్ప’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ శనివారం తన 41వ పుట్టిన రోజును జరుపుకున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆర్ఆర్ఆర్ స్టార్ ఎన్టీఆర్‌ చెప్పిన విషెస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఈ నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన ట్వీట్ చేశారు. ‘‘అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ, శుభాకాంక్షలకు థ్యాంక్యూ. నేను నిజంగా ధన్యుడిని. ఎప్పటికీ కృతజ్ఞుడిని’’ అని పేర్కొన్నారు. 

ఇక అల్లు అర్జున్‌, ఎన్టీఆర్ మధ్య సరదాగా సాగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దెబ్బకు ‘బావ’ అనే పదం ట్విట్టర్ లో ట్రెండింగ్‌లోకి చేరింది. ‘హ్యాపీ బర్త్‌డే బావ.. ఈ సంవత్సరం నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’ అని తారక్‌ ట్వీట్‌ చేశారు. దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ.. ‘నీ లవ్లీ విషెస్‌కు థ్యాంక్యూ బావా.. నీకు నా హగ్స్‌..’ అని సమాధానమిచ్చారు. దీనిపై ఎన్టీఆర్‌ .. ‘కేవలం హగ్స్‌ మాత్రమేనా? పార్టీ లేదా పుష్ప?’(పుష్ప్ సినిమాలోని డైలాగ్)  అంటూ స్మైలీ ఎమోజీని యాడ్‌ చేశారు. దీనికి బన్నీ.. ‘వస్తున్నా’ (ఎన్టీఆర్ 30 చిత్రంలోని డైలాగ్‌) అని కన్నుగీటారు.

Allu Arjun
Pushpa
birthday wishes
  • Loading...

More Telugu News